నర్మెట బీఆర్ఎస్ లో ప్రోటోకాల్ లొల్లి

by Sumithra |   ( Updated:2023-09-14 12:33:33.0  )
నర్మెట బీఆర్ఎస్ లో ప్రోటోకాల్ లొల్లి
X

దిశ, నర్మెట్ట : జనగామ ఎమ్మెల్యే ముతిరెడ్డి ఆదేశాల మేరకు గండిరామవరంలోని మల్లన్న గండి రిజర్వాయర్ లో గురువారం చేపపిల్లల్ని వదిలారు. ఎంపీపీ గోవర్ధన్ నాయక్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్ నాయక్ లు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మండల అధ్యక్షులు చింతకింది సురేష్, నర్మెట్ట సర్పంచ్ ఆమెడపు కమలాకర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ ఎండి.గౌస్ లు అక్కడకు వచ్చి తాము రాకముందే కార్యక్రమాన్ని ఎలా ముగిస్తారని ఎంపీపీ, జడ్పీటీసీలను ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ నాయకుల తీవ్రవాగవాదం చోటుచేసుకుంది.

దీంతో నాయకులు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని జిల్లా మత్యశాఖ అధికారి బి.నాగులు, ఫెల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సొసైట్ అధ్యక్షులు వడపల్లి రాజు, సెక్రటరీ యాదగిరి పై మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరగడంతో అక్కడున్న సీనియర్ నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో గండిరామవరం సర్పంచ్ జాల శ్వేత కిషన్, మనుబోతుల తండా సర్పంచ్ శ్రీనివాస్, మండల కో ఆర్డినేటర్ నీరటి సుధాకర్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రామిని శివరాజు, చుట్టూ పక్కల గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story