ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుగ్రామాలపై పోలీసుల నిఘా!

by Anjali |
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుగ్రామాలపై పోలీసుల నిఘా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఛత్తీస్‌గడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది నక్సల్స్ హతమవ్వగా.. ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే. కాంకర్ జిల్లాలోని హపటోలా అడవిలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పులు మంగళవారం చోటుచేసుకోగా.. పక్కా సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ వెల్లడించారు. తాజాగా ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ కన్నాయిగూడెం మండలంలోని గుత్తికోయ గూడాలను సందర్శించారు. అక్కడి గిరిజనులకు సంఘ విద్రోహుల గురించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

సంఘ విద్రోహులకు ఆశ్రయం ఇవ్వొదని గుత్తికోయ గూడాల ప్రజలకు సూచించారు. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో అమాయకపు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చనే అపోహా వదలాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని తెలిపారు. ములుగు జిల్లా నుంచి అజ్ఞాతంలో సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేయయనున్న నాయకులు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పారు. వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును, జీవనోపాధి కోసం పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed