- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు : దాస్యం వినయ్ భాస్కర్
దిశ,వరంగల్ కలెక్టరేట్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్నేహ నగర్ లో నియోజకవర్గ బూత్ కన్వీనర్ ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ఒక్కో బూత్ కన్వీనర్ తానే అభ్యర్థిలాగ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జొడెద్దులుగా ముందుగా తీసుకెళ్లిన బిఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లి ఓట్లు అడగాలని, గత 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమై ఓట్లు అడగాలి. రేపటి నుంచి ఎన్నికల అయ్యేంతవరకు బూత్ స్థాయిలో విజయానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని గెలుపు కోసం సంపూర్ణ బాధ్యత మీరే తీసుకోవాలని సూచించారు. సంక్రాంతికి గంగిరెద్దుల్లోల్లు వచ్చినట్లు.. ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్, బీజేపోళ్లు వచ్చినప్పుడు వాళ్లను నిలదీసి అడగండి, మీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించండన్నారు. ఇప్పుడు ఒక్క చాన్స్ అని కాంగ్రెస్ అడుగుతోంది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్కు 11 చాన్సులిచ్చాం. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు. వారి హయంలో రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, తాగునీరు, ఉచిత కరెంట్, విద్యాసంస్థలు ఎందుకు పెట్టలేదని ప్రజలు ప్రశ్నించేల బూత్ స్థాయిలో మీటింగ్ పెట్టి వివరించాలన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి పని చేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.