- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హవ్వ.. ఇదేనా పనితనం.. చీ చీ..!
దిశ, మరిపెడ (చిన్నగూడూర్ ) : అధికారుల, ప్రజా ప్రతినిధుల పనితనాన్ని చూసి ఇదేనా అభివృద్ధి పనులు చీ చీ అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. పనిచేశామా..? చేతులు దులుపుకున్నామా..? అడిగేవారు లేకుంటే ఇలా ప్రదర్శిస్తారులెండి.! గ్రామాల అభివృద్ధి పేరిట ఇబ్బడిముబ్బడిగా సీ సీ రోడ్లు వేస్తున్నారు. నిధుల కేటాయింపు శిలాఫలకం ఉండదు. క్వాలిటీ లేకుండా రోడ్లు వేస్తున్నారు. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ అసలుండదు. పర్సెంటేజీ వచ్చిందా ఎం బి రికార్డులు చేశామా అన్నదే పనితీరుగా మారింది అని ఆరోపణలు వేళ్ళు వెతుతున్నాయి నడిరోడ్డుపై విద్యుత్ స్తంభాలు తొలగించకుండానే సీసీ రోడ్డు వేసిన వైనం చూసి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చిన్నగూడూరు మండలం కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలోని బొల్లి కొండ బజార్ లో సీసీ రోడ్డు ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఈ సీ.సీ రోడ్డుకు సంబంధించి ఇది ఎన్ ఆర్ ఇ జిస్ నిధుల, రాష్ట్ర ప్రభుత్వా నిధుల, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల అసలు ఈ నిధులు ఎలా మంజూరు అయ్యాయి ? అసలు ఈ సి. సి రోడ్ కు ఎంత ఖర్చు చేసారో? అని కనీసం ఒక శిలాఫలకం లేకుండా సిసి రోడ్డుని నిర్మించడం గమ్మత్తు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఏదైనా వర్క్ చేసే ముందు పూర్తి వివరాలతో ఒక శిలాఫలకం నిర్మించాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా శిలాఫలకాలు లేకుండా నిర్మాణాలు జరిగిన వాటిపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
సీసీ రోడ్డు మధ్యలో కరెంటు స్తంభం.!
ఒక నిర్మాణం చేపట్టే ముందు వివిధ సర్వేలు చేసి తధానానంతరం ఏమైనా సమస్యలు ఉండి ఉంటే వాటిని పరిశీలించి పూర్తి అయిన తర్వాత అవసరమైతే గ్రామపంచాయతీ తీర్మానం పరిగణలోకి తీసుకొని ఏటువంటి సమస్య లేకుండా అప్పుడు నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. కానీ దీనికి విరుద్ధంగా సదర్ కాంట్రాక్టర్,ఇంజనీరు కనీసం అవగాహన లేకుండా ఒక కరెంటు స్తంభం అడ్డు వస్తే దానిని వేరొక చోటుకు మార్చకుండా రహదారి మధ్యలో అడ్డు ఉన్నా సరే సీ.సీ రోడ్డు నిర్మించి పూర్తిచేయడం విశేషం.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.!
వీరి పనితనం చూసిన ప్రజలు "శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు" అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధంగా సీసీ రోడ్డుని నిర్మిస్తే వాహనములు ఏ విధంగా ఎలా వెళ్లాలి? రాత్రి సమయంలో సరిగా కనపడి కనపడక వాహనం నడిపే వ్యక్తి స్తంభాన్ని ఢీ కొట్టి ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అంటూ? వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. చూడాలి ఇలాంటి ఘటన పైన ఉన్నత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.