బీడీఎస్ 'మేనేజ్‌మెంట్' సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల

by Satheesh |   ( Updated:2022-12-19 14:29:56.0  )
బీడీఎస్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎంజీఎం సెంటర్: ప్రైవేటు దంత కళాశాలలలో యాజమాన్య కోటా బీడీఎస్ ప్రవేశాలకు మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను సోమవారం కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రెండవ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

READ MORE

'పోలీస్ ఈవెంట్స్‌లో లాంగ్‌జంప్ దూరాన్ని తగ్గించాలి'

Advertisement

Next Story