MLA Naini Rajender Reddy : కాంగ్రెస్ సైనికులం రాహుల్ గాంధీ ప్రాణానికి అండగా ఉంటాం..

by Aamani |
MLA Naini Rajender Reddy : కాంగ్రెస్ సైనికులం రాహుల్ గాంధీ ప్రాణానికి అండగా ఉంటాం..
X

దిశ,హనుమకొండ : కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జూడో యాత్ర చేసిన ఏకైక నేత రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్ సైనికులం రాహుల్ గాంధీ ప్రాణానికి అండగా ఉంటాం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..బీసీ బిడ్డ మా అందరి ఆప్తుడు మహేష్ కుమార్ కి పీసీసీ అధ్యక్షులుగా రావడం చాలా సంతోషం అన్నారు.

10 ఏళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న తీసుకొని గొప్ప కుటుంబం, గాంధీ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది అన్నారు. రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జూడో యాత్ర చేసిన ఏకైక నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసే కుటుంబాన్ని టెర్రరిస్ట్ గా మాట్లాడే నాయకులకు సిగ్గుందా, మా కార్యకర్తల ప్రతిసారి సహనం పాటించడం కుదరదు అని అన్నారు. రాహుల్ గాంధీ కి దేశ ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ పట్ల నరేంద్ర మోడీ, అమిత్ షా లు చేస్తున్న కుట్ర అని అన్నారు.ప్రతి కాంగ్రెస్ సైనికులం రాహుల్ గాంధీ ప్రాణానికి అండగా ఉంటాం అన్నారు.

పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయకుండా బీజేపీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే లు ప్రధాన మంత్రి మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా కనుసన్నల్లో గాడ్సే విధానాలను అనుసరిస్తున్నారు. తీవ్ర వాదులలాగా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే ప్రధాని, హోమ్ మంత్రి చోద్యం చూస్తున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ ఆషామాషీ వ్యక్తి కాదు, దేశ ప్రజలు ఒక ప్రధానమంత్రి కావాలని చూస్తున్న నేతను పట్టుకుని నాలుక కోస్తా, టెర్రరిస్ట్ గా సంభోదిస్తే సహించేది లేదు అన్నారు. ఆనాడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కానీ, పార్టీ ప్రయోజనాల కోసం కానీ మరణించలేదు, దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా, దేశంలో తీవ్రవాదం రూపు మాపలనే చర్యలో త్రివ్ర వాదుల చేతిలో హత్య కాబడినారు. ఆనాడు ఈ దేశానికే ఒక సంపన్న కుటుంబంగా ఉండి దేశం కోసం ప్రాణత్యాగలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీది అన్నారు. అగర్బ శ్రీమతుడిగా ఉండి కూడా దేశ స్వతంత్ర పోరాటంలో దేశంలో ఎవరూ లేని విధంగా 16 ఏళ్ళు దేశం కోసం జైలు జీవితం గడిపారు.

మోదీ ఏ రోజైన దేశం కోసం జైలుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయా, కనీసం నీ ఇంట్లో కుక్క అయిన ప్రాణత్యాగం చేసింద, ఇలాంటి నేతలు చరిత్రను మరిపించే చర్యలు చేస్తున్నారు. దేశంలో రాహుల్ కి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలు భాగమే ఇవి అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ గుండు సుధారాణి, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, ఎమ్మెల్యే లు రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed