Minister Seethakka: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి..

by Aamani |
Minister Seethakka:  అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి..
X

దిశ, కొత్తగూడ : అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలని పంచాయితీ రాజ్ శాఖ, శిశు, మహిళా, పర్యాటక శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క ) అన్నారు. బుధవారం గంగారం మండలంలోరూ. 40 కోట్ల లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సీతక్క,ఎంపీ బలరాం నాయక్ లకు గ్రామ గ్రామాల్లోని ప్రజలు హారతులు పడుతూ డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు .ఏజెన్సీ ప్రాంతం అవ్వడం తో అడుగడుగునా భారీ పోలీసు బందోబస్తు మధ్య పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...వెనుకబడిన గంగారాం కొత్తగూడా మండలాలలో అభివృద్ధియే లక్ష్యంగా ప్రతి గ్రామానికి రోడ్డు డ్రైనేజీ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. దేశ కోసం పాటుపడిన రాహుల్ గాంధీని చంపుతామని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం శోచనీయం అని వాక్యాలు చేసిన ఎమ్మెల్యే పై బీజేపీ చర్యలు తీసుకొవాలని ,రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫోన్ చేసి చెపితే స్పందిస్తా : మంత్రి సీతక్క

నియోజకవర్గ ప్రజలే ప్రాణంగా నియోజవర్గ అభివృద్ధియే లక్ష్యంగా భావించే పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకి ఆ రెండు గ్రామాలపై మరింత మక్కువగా చూస్తున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల లోని కర్నగండి, దొరవారి వేంపల్లి గ్రామాలపై మమకారంతో మంత్రి సీతక్క ఆ రెండు గ్రామాలను సందర్శించారు. ములుగు నియోజకవర్గం ఉమ్మడి కొత్తగూడ మండలంలోని ఆ రెండు గ్రామాల నుండి జరిగిన పర్యాయలలో 2019,2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన సీతక్కకు దాదాపు వంద శాతం ఓట్లను వేశారని కేవలం రెండు గ్రామాల నుండి ఐదు ఓట్లు మాత్రమే ఇతర పార్టీకి వేశారని నా మీద ఇంతటి అభిమానంతో ఓట్లను వేసి గెలిపించిన మీకు రుణపడి ఉంటాను అని మీకు ఏ సమయంలో గుర్తుకు వచ్చిన ఫోన్ చేసి చెపితే స్పందిస్తానని ఆ గ్రామాల ప్రజలకు అన్నారు.

అభివృద్ధిలో భాగంగా గెలిచిన కొన్ని రోజుల్లోనే సీసీ రోడ్లు,కమ్యూనిటీ హల్ మర్రిగూడ క్రాస్ నుండి దొరవారి వేంపల్లి వరకు రోడ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మధ్యంతరంగా నిలిచిన మెటల్ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల నారాయణ రెడ్డి,మాజీ జడ్పీటీసీ లు, పులసం పుష్పలత శ్రీనివాస్, ఈసం రామ సురేష్, ఎంపీపీ లు విజయ రూప్ సింగ్, సరోజన జగ్గారావు, ఐటీడీఏ, పంచాయతీరాజ్,ఇరిగేషన్ ఆర్ అండ్ బి సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed