దేశం చూపు బీఆర్ఎస్ వైపు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Javid Pasha |   ( Updated:2023-01-19 14:15:12.0  )
దేశం చూపు బీఆర్ఎస్ వైపు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, హనుమకొండ టౌన్ : దేశం చూపు బీఆర్ఎస్ వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఫుల్ సక్సెస్ అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం సభ విజయవంతం అయిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ పార్టీ స్థాపించి నిర్వహించిన మొదటి సభలోనే ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం, కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు తరలిరావడం కేసీఆర్ పై దేశ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ క్రమంలోనే అక్కడి నాయకులు, ప్రజలు కేసీఆర్ పథకాలపై ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

ఖమ్మం సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ పథకాలను తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, కంటి వెలుగు వంటి ఎన్నో పథకాల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని మండిపడ్డారు. బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యమ్యాయం అని.. బీజేపీ, మోడీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోయి కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పారు. ఖమ్మం సభను విజయవంతం చేసినా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed