- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్‌పై తగ్గని అభిమానం.. ఇప్పటికీ అదే మంత్రం జపిస్తున్న మంత్రి
దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నందమూరి తారక రామారావు అంటే ఎంతో అభిమానం. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటికీ ఆ పెద్దాయనను స్మరించుకుంటూనే ఉంటారు. మంచి పరిపాలన గురించి చెప్పాల్సి వస్తే కచ్చితంగా ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ వస్తుంటారు. తాజాగా ములుగులో పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఎన్టీఆర్, కేసీఆరే పేదలకు న్యాయం చేశారన్నారు. మిగిలిన ముఖ్యమంత్రులంతా కమీషన్లు కోసం పని చేశారన్నారు. ఇక ములుగు జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు పని చేశారని చెప్పారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా కేవలం పదేళ్లలోనే అవుతాయా అని ప్రశ్నించారు. ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ వస్తున్నామని, దేనికైనా ఓపికనేది అవసరమని ఎర్రబెల్లి తెలిపారు. గిరిజనులతో పాటు అర్హులైన గిరిజనేతరులకూ పోడు పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే పోడు భూములు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం అడ్డుపడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.