- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హై అలర్ట్.. జిల్లాలో పెరిగిన మావోయిస్టుల కదలికలు..
ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏటూరునాగారం మండలంలోని చెల్పాక - ఐలాపూర్ మధ్యలో పోలకొమ్ము అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ దళంగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు పారిపోయారన్న అనుమానంతో అడవులు, పరిసర గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దశాబ్దన్నర కాలం తర్వాత భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం జరిగింది. ఒకే ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైన సంఘటనలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు చోటు చేసుకోకపోవడం గమనార్హం. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని అటు మావోయిస్టులు ప్రకటనలు విడుదల చేస్తూ.. ములుగు ఏజెన్సీలోనూ వారోత్సవాల నిర్వహణకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా ఎన్‌కౌంటర్ ఘటనతో గొత్తికోయ గూడేలు, గిరిజన, ఆదివాసితండాలు భయం గుప్పిట్లోకి వెళ్లాయి. మావోయిస్టుల సంచారం, పోలీసు దళాల కూంబింగ్‌ల నేపథ్యంలో గిరి, ఆదివాసీ జనం ఆందోళన చెందుతున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో/ములుగు ప్రతినిధి/ఏటూరునాగారం : ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏటూరునాగారం మండలంలోని చెల్పాక - ఐలాపూర్ మధ్యలో పోలకొమ్ము అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 6:18 గంటలకు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ దళంగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ఇల్లందు - నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కుర్సం మంగు అలియాస్ భద్రు (35) అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమాండర్ ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు (43)తోపాటు దళ నాయకులు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), దళ సభ్యురాలు ముస్సాకి జమున(23), జైసింగ్ (24), కిషోర్ (22), కామేష్ (23) ఉన్నారు.
జిల్లాలో మావోయిస్టుల కదలికలు..!
ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కొందరు మావోయిస్టులు పారిపోయారన్న అనుమానంతో అడవులు, పరిసర గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దశాబ్దన్నర కాలం తర్వాత భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం జరిగింది. ఒకే ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైన సంఘటనలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎప్పుడు చోటు చేసుకోకపోవడం గమనార్హం. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని అటు మావోయిస్టులు ప్రకటనలు విడుదల చేస్తూ.. ములుగు ఏజెన్సీలోనూ వారోత్సవాల నిర్వహణకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ములుగు జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను అత్యంత దారుణంగా హతమార్చారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలులో పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేష్, అదే గ్రామానికి చెందిన అర్జున్ అనే గిరిజనుడు ఉన్నారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారమివ్వడం మానుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు లేఖలో మావోయిస్టులు వెల్లడించిన విషయం తెలిసిందే.
భయం గుప్పిట గొత్తికోయలు!
తాజా ఎన్‌కౌంటర్ ఘటనతో గొత్తికోయ గూడేలు, గిరిజన, ఆదివాసితండాలు భయం గుప్పిట్లోకి వెళ్లాయి. మావోయిస్టుల సంచారం, పోలీసు దళాల కూంబింగ్‌ల నేపథ్యంలో గిరి, ఆదివాసీ జనం ఆందోళన చెందుతున్నారు. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. గుత్తి కోయాలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి వాహనాన్ని ఆపి, చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సరిహద్దులలో భారీగా బలగాలను మోహరించారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. మావోలతో బెడద ఉన్న లీడర్లను తాత్కలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించినట్లు సమాచారం.
కన్నాయిగూడెం మండలంలో తనిఖీలు
ఈనెల 2నుంచి 8వరకు మావోయిస్టులు జరిపే పీఎల్‌జీఏ 24వ వారోత్సవాల నేపథ్యంలో ఆదివారం ములుగు జిల్లాలోని ఏటూరునాగరం మండలంలోని చల్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్‌లో మావోస్టులు మృత్యువాత పడ్డారు. దీంతో కన్నాయిగూడెం స్థానిక ఎస్ఐ వెంకటేష్ మండలంలో ఉన్న అటవీ గ్రామాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అనుమానిత వ్యక్తులు ఎవరైనా గిరిజన గూడెల్లోకి వస్తే ఆశ్రమం కల్పించొదని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన ఫెర్రీ పాయింట్స్ వద్ద కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అదేవిధంగా సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల పంప్ హౌస్ పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నట్టు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. మండలంలో ప్రధాన కూడలిలో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలతో మోహరించి వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.