- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
JSW Steel: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ సంకేతాలిచ్చారు. దేశీయంగా అత్యంత వేగంగా పెరుగుతున్న ఈవీ పరిశ్రమలో కీలక ప్లేయర్‌గా మారాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చైనా వాహన తయారీ సంస్థ ఎంజీతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటును ప్రకటించింది. అయితే, తాజా సజ్జన్ జిందాల్ వ్యాఖ్యలను బట్టి సొంతంగానే గ్రూప్ తన ఈవీ బ్రాండ్‌ను తీసుకురావాలని భావిస్తోంది. తన ఈవీ ప్లాంటును మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీనికోసం రూ. 27,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 5,200 మందికి ఉపాధి అందించనుంది. ప్రధానంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్యాసింజర్ వాహనాలతో కమర్షియల్ ఈవీలపై దృష్టి సారించనుంది.