- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్టాండ్ లో పారిశుద్ధ్యం తొలగించిన అధికారులు..
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో పారిశుద్ధ్యం పై అధికారులు చర్యలు తీసుకున్నారు. "కంపు కంపు" "హుజురాబాద్ బస్టాండ్ లో లోపించినపారిశుద్ధ్యం" అనే శీర్షికన దిశ పత్రికలో గత రెండు రోజుల క్రితం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆర్టీసీ పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ అండ్ గ్రీన్ గా చేయించారు. బస్టాండ్ లోని ఈ టాయిలెట్స్ వద్ద, బస్టాండ్ ముందు, అంబేద్కర్ భవన్ స్థలంలో చెత్తను తొలగించారు. అలాగే అంబేద్కర్ భవన స్థలంలో చెత్తా చెదారం వేయకుండా మల ,మూత్రాలు విసర్జించకుండా అడ్డుగా గ్రీన్ నెట్ ను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లో పేరుకుపోయిన పారిశుద్ధ్యం పై కథనం ప్రచురించిన దిశ పత్రికకు, దీనికి స్పందించిన ఆర్టీసీ, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.