- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2: మూడ్రోజుల్లో సినిమా విడుదల.. హైకోర్టుకు చేరిన పుష్ప-2 ఇష్యూ
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రతిష్టాత్మక పుష్ప-2(Pushpa-2) చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కూడా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో చిత్ర బృందానికి అనుకోని చిక్కులు వచ్చాయి. పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
కాగా, ప్రీమియర్ షో టికెట్ ధరపై రూ.800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య రూ.200, ఆ తర్వాత కూడా పెంపునకు అవకాశం ఇచ్చింది. పుష్ప-2లో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Read More...
‘పుష్ప-2’ విడుదలకు ముందు నాగబాబు సెన్సేషనల్ ట్వీట్.. అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?