- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Crocodile Head : ప్రయాణికుడి బ్యాగులో మొసలి తల !
దిశ, వెబ్ డెస్క్ : ఓ విమాన ప్రయాణికుడి బ్యాగు తనిఖీల్లో మొసలి తల (Crocodile Head) భాగం పట్టుబడటం కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయం విమానాశ్రయం(Indira Gandhi International Airport)లో ఈ సంఘటన జరిగింది. జనవరి 6న కెనడా పౌరుడైన వ్యక్తి టొరంటో వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్ కెనడా విమానం ఎక్కే ముందు సెక్యూరిటీ సిబ్బంది అతడిని తనిఖీ చేశారు.
అతడిపై అనుమానం రావడంతో టెర్మినల్ 3 వద్ద లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ప్రయాణికుడికి చెందిన ఒక బ్యాగ్‌లో మొసలి తల ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు ఆ మొసలి తలను స్వాధీనం చేసుకున్నారు.
777 గ్రాముల బరువున్న మొసలి తలను ఢిల్లీకి చెందిన అటవీశాఖ అధికారులు పరిశీలించారు. దర్యాప్తు కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు మొసలి తలను పంపారు. ఆ కెనడా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.