Key Development: రేషన్ బియ్యం కేసులో నిందితులకు మరోసారి కస్టడీ

by srinivas |
Key Development: రేషన్ బియ్యం కేసులో నిందితులకు మరోసారి కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం కేసు(Ration Rice Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులను మరోసారి కస్టడీ(Custody)కి ఇస్తూ కోర్టు(Court) అనుమతించింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మచిలీపట్నం కోర్టు(Machilipatnam Court)లో బుధవారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తే ఆదేశించింది. దీంతో ఈ కేసు నిందితులు ఏ2 మానస తేజ, ఏ4, మంగారావు, ఏ5 ఆంజనేయులను రెండు రోజులు పాటు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలుకా పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కుటుంబానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం మాయమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో పేర్ని నాని ఫ్యామిలీ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టు వెళ్లింది. అయితే పేర్ని నాని సతీమణి జయసుధ(Perni Jayasudha)కు ఊరట కలిగింది. ముందస్తు బెయిల్ మంజూరు అయింది. అయితే పోలీసు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇక ఈ కేసులో ఏ2 నిందితుడు మానస తేజను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పేర్ని నాని బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story