రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు.. ACB విచారణపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Gantepaka Srikanth |
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు.. ACB విచారణపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు(Formula E Car Race Case)లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఏసీబీ విచారణ ముగించింది. గురువారం దాదాపు ఏడు గంటలపాటు అధికారులు కేటీఆర్‌ను విచారించారు. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించా. నాకు ఉన్న అవగాహన మేరకు అన్నింటికీ సమాధానం ఇచ్చాను. మళ్లీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాసిచ్చిన ప్రశ్నలనే అధికారులు తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. నాలుగు ప్రశ్నలను 40 సార్లు అడిగారు’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. సంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పెద్ద మొత్తంలో నిధుల చెలామణీ, అన్యాయంగా ఆర్థిక లావాదేవీలు జరగడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఇవాళ కేటీఆర్‌ను అధికారులు విచారించారు.

Advertisement

Next Story