- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Navy: 2036 నాటికి స్వదేశీ న్యూక్లియర్ సబ్‌మెరైన్ డెలివరీ: నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి
దిశ, నేషనల్ బ్యూరో: భారత నేవికి చెందిన న్యూక్లియర్-పవర్డ్ అటాక్ సబ్‌మెరైన్ (ఎస్ఎస్ఎన్) ప్రోగ్రామ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 2036 నాటికి మొదటి జలాంతర్గామి సిద్ధంగా ఉంటుందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి న్యూక్లియర్ జలాంతర్గామిని 2036 నాటికి డెలివరీ చేస్తామని, ఆ తర్వాత రెండేళ్లకు రెండో జలాంతర్గామి అందించనున్నట్టు చెప్పారు. 'ఈ ఎస్‌ఎస్‌ఎన్‌లు నావికాదళ శక్తిని, జాతీయ ప్రయోజనాలను కాపాడే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి' అన్నారు. ఎస్ఎస్ఎన్ రక్షణ పర్యావరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. దేశీయ పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇటీవలే భారత నౌకాదళం రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను ప్రారంభించారు. ఇది భారత నౌకాదళంలో మరో కీలక మైలురాయి అని త్రిపాఠి తెలిపారు. ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రస్తుతం క్షిపణి పరీక్షలతో సహా ట్రయల్స్ దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.