CAT-2024: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. క్యాట్-2024 ఎగ్జామ్ కీ విడుదల ఎప్పుడంటే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-02 15:16:54.0  )
CAT-2024: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. క్యాట్-2024 ఎగ్జామ్ కీ విడుదల ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) కాలేజీల్లోని మేనేజ్‌మెంట్(Management) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్-2024(CAT-2024)ను నవంబర్ 24న కండక్ట్(Conduct) చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది క్యాట్‌కు మొత్తం 3.29 లక్షల మంది దరఖాస్తు(Apply) చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ కీ(Provisional key) రేపు విడుదల కానుంది. అభ్యర్థులకు కీపై ఏమైనా అభ్యంతరాలు(Objections) ఉంటే డిసెంబర్ 5 రాత్రి 11.55 వరకు అధికారిక వెబ్‌సైట్ http://iimcat.ac.in ద్వారా ఆన్‌లైన్ లో తెలియజేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించిన ఈ ఎగ్జామ్ లో సాధించిన స్కోర్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ మార్కులతో ఐఐఎం(IIM)లే కాకుండా పేరున్న కాలేజీలు(Reputed colleges) కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. కాగా క్యాట్ ఫలితాలు(CAT Results) డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed