- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
POCSO Court: దుర్బుద్ధితో కన్నేశాడు.. మరణించే వరకూ జైలు పాలయ్యాడు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఓ పంతులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించారు. స్కూలు మారినా వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ప్రబుద్ధుడి తీరుపై పోక్సో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభంశుభం తెలియని విద్యార్థిని పట్ల చేసిన పాపానికి మరణించే వరకూ శిక్ష విధించింది. రూ. 25 వేలు ఫైన్ కూడా వేసింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఓ స్కూల్లో లెక్కలు మాస్టారుగా పని చేసిన షేక్. మొహమ్మద్ అప్సర్ బాషా.. అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. విద్యార్థితో చనువుగా ఉంటూ ఆమెతో ఫోన్ చాటించే చేసేవాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు విద్యార్థిని చెప్పడంతో బాషాను వేరే స్కూలుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయినా టీచర్ తీరులో మార్పు రాలేదు. ఆ స్కూలు మానేసి వేరే చోట చదువుకుంటున్న విద్యార్థిని వద్దకు వెళ్లారు. మాయ మాటలు చెప్పి హైదరాబాద్, నరసరావుపేటకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు చార్జిషీట్ దాఖలు చేశారు.
అయితే సుదీర్ఘకాలం విచారణ చేపట్టిన ఒంగోలు పోక్సో కోర్టు.. నిందితుడు బాషా తప్పు చేసినట్లు నిర్ధారించింది. పోలీసులు అన్ని సాక్షాధారాలు సమర్పించడంతో నేర నిరూపణ అయింది. దీంతో బాషాకు మరణించే వరకూ జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 25 వేల జరిమానా వేసింది.