- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రొఫెసర్ అన్యమత ప్రచారం.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీకి చెందిన చెంగయ్య అనే ఫ్రొఫేసర్.. క్లాసులో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన స్థానిక బజరంగ్ దళ్ సభ్యులు.. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్ హెడ్ చెంగయ్యపై వీసీకీ ఫిర్యాదు చేశారు. అయితే క్లాస్‌లో అన్యమత ప్రచారం చేయడమే కాకుండా.. విద్యార్థులను బెదిరించాడు. దీంతో వీసీకి ఫిర్యాదు చేసిన తర్వాత చెంగయ్య డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన్ను నిలదీశారు. ఈ క్రమంలో తాను చేసిన పనిని సమర్ధించుకున్న ప్రొఫెసర్.. తాను ప్రచారం చేసింది విద్యార్థులను సన్మార్గంలో నడపడానికి అంటూ వితండవాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు.. చెంగయ్యను డిపార్ట్మెంట్ నుంచి బయటకు లాగీ ఆయన మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా ఎస్వీ యూనివర్సిటీ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.