Breaking News : విభజన అంశాలపై ముగిసిన తెలుగు రాష్ట్రాల భేటీ

by M.Rajitha |
Breaking News : విభజన అంశాలపై ముగిసిన తెలుగు రాష్ట్రాల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం అమరావతిలో నిర్వహించిన తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాల విభజన అంశాల(Partition elements)పై సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ ల కమిటీ పాల్గొంది. కాగా ఈ సమావేశంలో 3 అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయనికి వచ్చినట్టు సమాచారం. రూ.861 కోట్ల లేబర్ సెస్ పంపిణీకి రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు తెలుస్తోంది. పన్నుల పంపిణీపై రెండు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశమయ్యి ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. ఇక విద్యుత్ బకాయిలపై, 9,10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు అప్పులపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయనికి రాలేదు. ఎక్సైజ్ శాఖ అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లను వెనక్కి ఇవ్వడానికి ఏపీ అంగీకరించింది. డ్రగ్స్ నివారణకు రెండు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ అధికారులతో కమిటీ వేసేందుకు నిర్ణయించాయి. ఉద్యోగుల విభజనపై చాలాసేపు చర్చ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి విభజన అంశాలపై చర్చించేందుకు కమిటీ డిసైడ్ అయింది.

Advertisement

Next Story

Most Viewed