ఆ షిప్‌ను తనిఖీ చేద్దాం.. వస్తారా.. వదిలేస్తారా..?: పవన్‌కు అంబటి సవాల్

by srinivas |
ఆ షిప్‌ను తనిఖీ చేద్దాం.. వస్తారా.. వదిలేస్తారా..?: పవన్‌కు అంబటి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: పేదల బియ్యం సముద్ర మార్గం(Sea ​​Route) ద్వారా విదేశాలకు తరలిపోతున్న విషయం తెలిసిందే. ఈ ఇటీవల కాకినాడ(Kakinada) కలెక్టర్ జరిపిన తనిఖీల్లో రేషన్ బియ్యం(Ration rice) అక్రమ దందా గుట్టు రట్టు అయింది. కాకినాడ యాంకరేజి పోర్టులో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యంతో పశ్రిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌక(Stella L ship)లో కలెక్టర్ షాన్ మోహన్(Collector Shan Mohan) సోదాలు చేసి సీజ్ చేశారు. దీంతో పేదల బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ వద్ద పోర్టులో స్టెల్లా షిప్‌ను పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై మండిపడ్డారు. అయితే అసలు ఈ దందా గత ప్రభుత్వంలోనే ప్రారంభమైందనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ ఇష్యూ రాజకీయ దుమారం రేపింది. వైసీపీ నాయకులు-కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

అయితే మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Former minister and YCP leader Ambati Rambabu) తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. స్టెల్లా షిప్‌(Stella ship)నే కాదని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) వియ్యంకుడు కృష్ణారావు కెన్ స్టార్ షిప్‌ను సైతం సోదాల చేయాలని డిమాండ్ చేశారు. నైజీరియా వెళ్లేందుకు కెన్‌స్టార్ షిప్(Kenstar Ship) 42,500 టన్నుల రేషన్ బియ్యంతో రెడీగా ఉందని పట్టుకుంటారా..?, వదిలేస్తారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)కు ఆయన సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed