దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్..

by Kalyani |
దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్..
X

దిశ, రఘునాధపల్లి: మండల పరిధి కొమ్మల్ల గ్రామంలో గత నెల 10వ తేదీన వేల్పుగొండ అశోక్ ఇంట్లో దొంగతనం జరుగగా బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు వేల్పుగొండ కృష్ణను కోమళ్ల రైల్వే గేట్ వద్ద అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కృష్ణ విచారణలో దొంగతనాన్ని తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. కృష్ణ మరికొన్ని దొంగతనాలు కూడా చేసినట్టు పోలీసులకు తెలిపాడు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి స్టేషన్ ఘనపూర్ ఏసీపీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.

నిందితుడి వద్ద ఐదు గ్రాముల గోల్డ్ చైన్, 10గ్రాముల బంగారు కడ్డీలు, నాలుగు గ్రాముల బంగారు చెవి కమ్మలు, పది తులాల వెండి గొలుసులు, 68 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆర్ సంతోష్, సబ్ ఇన్ స్పెక్టర్ ఎన్ వీరేందర్ లను ఏసీపీ డి రఘుచందర్ అభినందించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, నవీన్ రెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed