క్షయ వ్యాధి నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేద్దాం: కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య

by Kalyani |
క్షయ వ్యాధి నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేద్దాం: కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య
X

దిశ, ములుగు ప్రతినిధి: క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్యశాఖ కృషి ఒకటే సరిపోదని, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సంయుక్తంగా వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్షయ వ్యాధి నిర్మూలన కు సంబంధించి ప్రదర్శన చిత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వలన ప్రజలు ఆరోగ్యం విషయమై ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టడం జరిగిందని, అదే రీతిలో క్షయ వ్యాధిపై కూడా ముందస్తు చర్యల పైనే వైద్యులు దృష్టి పెడుతూ క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో జిల్లా ప్రథమ స్థానం చేరుకునేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంవో తిరుపతయ్య, డీపీపీఎం సమ్మయ్య, సీహెచ్ఓ దుర్గారావు, సంపత్ రావు, హెచ్ఈ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story