కోడ్ కూసిన ఆగని దళిత బంధు

by Aamani |   ( Updated:2023-10-09 09:59:26.0  )
కోడ్ కూసిన ఆగని దళిత బంధు
X

దిశ,నర్సింహులపేట: నర్సింహులపేట మండల కేంద్రంలో ఎన్నికల కోడ్ కూసిన కూడా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ప్రభుత్వ పథకాలకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఎన్నికల కోడ్ కూసిన రెండు గంటలు గడవకముందే అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాల ధరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయంలో అందించడం విస్మయానికి గురి చేసింది.మండలంలోని బొజ్జన్న పేట సర్పంచ్ భర్త,బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు,గ్రామస్తులు,స్థానిక పంచాయతీ కార్యదర్శి సమక్షంలో ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గదిలో దళిత బంధు ధరఖాస్తులు అందించారు.ఎన్నికల కోడ్ కూసిన కూడా దళిత బంధు దరఖాస్తులు చేసుకోవడం ఏమిటని అధికార పార్టీ నాయకులకు ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రజలు,ప్రతిపక్ష పార్టీ నాయకులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న ఎంపీడీవో భారతి ధరఖాస్తులు యిచ్చే బీఆర్ఎస్ నాయకులను బయటకు పంపి కార్యాలయ సిబ్బంది,సంబంధిత పంచాయతీ కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story