కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి: రజిత రాజు

by S Gopi |
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి: రజిత రాజు
X

దిశ, రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ చిగురుమామిడి రజితరాజు అన్నారు. గురువారం వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏదైనా కంటి సమస్య ఉంటే ఉచితంగా మందులు, కళ్ళజోడులు అందజేస్తారని తెలిపారు. అనంతరం సర్పంచ్ కంటి పరీక్షలు చేపించుకుని కళ్ళజోడును పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండు కుమారస్వామి, కార్యదర్శి స్వప్న, కంటి వైద్యులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ వెంకన్న, ఏఎన్ఎం రాధిక, శారద, ఐసీడీఎస్ సీసీ ఉమాదేవి, అంగన్వాడీ టీచర్స్ కవిత, విజయ, వివో కుమారస్వామి, ఆశా వర్కర్స్ స్వప్న, అశ్విని పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed