- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంచనపల్లి సింగిల్ విండో చైర్మన్ సస్పెండ్
దిశ, జనగామ: జనగామ జిల్లా లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఒక్కోక్కటిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసి అక్కడ జరిగిన అవినీతి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని ధర్నాలు రాస్తారోకోలు చేశారు. డీసీవో వెంటనే చర్యలు తీసుకున్నారు.
ఆ సంఘటన మరవకముందే ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న కంచన పల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పై రాపోలు రామ్మూర్తి చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు అని సభ్యులు అంటున్నారు.కంచనపల్లి సింగిల్ విండో చైర్మన్ చీమలపాటి రవీందర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వాటికి సంబంధించిన ఉత్తర్వులు గోడపై ప్రచురించడం జరిగిందని తెలిపారు. దీనిపై వివరణ కొరకు సంప్రదించగా జనగామ డీసీవో రాజేందర్ రెడ్డి అందుబాటులోకి రాలేదు.