- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది : ఎమ్మెల్యే
దిశ, బయ్యారం : రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ,రైతుల పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. మండలంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్, రామచంద్రాపురం రోడ్డు రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పటికి మరువబోమని ,రెండు లక్షల రుణమాఫీ చేశామని ,సన్న వరి ధాన్యానికి కింటాలకు 500 రూపాయలు అందం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతులు అధైర్య పడొద్దని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఫలాలు ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ,ఎంపిడిఓ విజయలక్ష్మి , మండల వ్యవసాయ అధికారి రాంజీ ,సొసైటీ డైరెక్టర్ లు. వేల్పుల శ్రీనివాస్ , నాగమణి ,సీతారాం రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.