బెల్ట్ షాపులకు జోరుగా లిక్కర్ సరఫరా

by Sathputhe Rajesh |
బెల్ట్ షాపులకు జోరుగా లిక్కర్ సరఫరా
X

దిశ, మరిపెడ (కురవి): రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా స్థావరాల పైన ఉక్కు పాదం మోపుతుండడంతో పల్లెల్లో బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు వైన్ షాపు ల యజమానులు సిండికేట్‌గా మరి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో సరుకును ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయ ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారమే కురవి మండలంలోని హాట్ టాపిక్ అవుతుంది.

అసలేం జరిగిందంటే.?

కురవి మండలంలోని సూదనపల్లి గ్రామంలో శివగంగా వైన్స్‌కు సంబంధించిన ఓ ట్రాలీలో మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. అలా చేయడమే కాకుండా ఎమ్మార్పీ కంటే పది రూపాయలు ఎక్కువగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆ బెల్ట్ షాప్‌లల్లో మద్యాన్ని రూ.15 నుంచి రూ.30 లాభంతో వారు అమ్ముతూ ప్రజల నుంచి డబ్బులను దండుకుంటున్నారు.

ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తే మండలంలోని వైన్ షాపునకు ఇక్కడి నుండి వెళ్తే నీకు బస్ చార్జీలే అవుతాయి కదా అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. ఇదే విషయమై మద్యం దుకాణ యజమాని వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ ఆ విషయాన్ని దాటవేస్తుండడం గమనార్హం. అబ్కారీ శాఖకు తెలిసినా కూడా పట్టించుకోకుండా నెలవారి మామూళ్ల మత్తులోనే మునుగుతున్నారని ఆరోపణలున్నాయి. జిల్లాకు చెందిన ఓ ఎక్సైజ్ అధికారిని వివరణ కోరగా చూద్దాం అంటూ యాక్షన్ తీసుకుంటారా అంటే ఉన్నతాధికారులకు చెప్తాను అంటూ దాట వేశారు.

Advertisement

Next Story

Most Viewed