- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా సేవాలాల్ జయంతి
దిశ, పర్వతగిరి : సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి ఉత్సవాలలో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతులు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే బంజారా సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు.
బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు. దీంతో శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా గిరిజనుల
ఆత్మగౌరవం ప్రతిబింబించేలా సేవాలాల్ బంజారా భవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారని అన్నారు. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బంజారా కుల పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.