- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ కళాశాల వసతులపై దృష్టి సారించండి: కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య
దిశ, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న మెడికల్ కళాశాల వసతులపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న వైద్య కళాశాల తరగతుల నిర్వాహణ కోసం గదుల నిర్మాణం, ప్రధాన కార్యాలయ భవనం తదితర సదుపాయాలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించి తక్షణమే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గోపాలరావు, డాక్టర్ సుగుణాకర్ రాజు, డాక్టర్ మహేందర్, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుమోహన్, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాం సందర్శన..
కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ లో జరుగుతున్న వీవీ ప్యాట్స్ పని తీరును ఆదివారం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ తనిఖీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఎన్నికల పర్యవేక్షకులు గంగాభవాని, ఎలక్షన్ డిటీ శంకర్ తదితరులు ఉన్నారు.