Enagala Venkatram Reddy : బీఆర్ఎస్ రాజ‌కీయ నాట‌కాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు..

by Aamani |   ( Updated:2024-08-25 16:28:17.0  )
Enagala Venkatram Reddy : బీఆర్ఎస్ రాజ‌కీయ నాట‌కాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు..
X

దిశ,హనుమకొండ : బీఆర్ఎస్ రాజ‌కీయ నాట‌కాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరని, వారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్నారని కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజ‌కీయ స్వార్థం తోనే బీ ఆర్ ఎస్ పార్టీ రైతు రుణ‌మాఫీ పై దుష్ప్ర‌చారం చేస్తుందని, రైతు రుణ‌మాఫీ కాలేదంటూ ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం అర్థ‌ర‌హితం అని, బీఆర్ఎస్ ఆందోళ‌న‌ల్లో రైతు లెవ్వ‌రూ పాల్గొన‌డం లేదు, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు త‌ప్పా..! రైతులెవ్వరూ లేరని అన్నారు. రైతు రుణ‌మాఫీ దాదాపుగా పూర్తి కావొచ్చిది, సాంకేతిక కార‌ణాలు, వివిధ స‌మ‌స్య‌ల కార‌ణంగానే అతి కొద్దిమందికి సంబంధించిన రుణ‌మాఫీ ప్రాసెసింగ్ లో ఉన్న‌మాట వాస్త‌వం అన్నారు.

ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న రైతుల నుంచి ప్ర‌భుత్వం చిత్త‌ శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తోంధని, ద‌ర‌ఖాస్తుల‌ను కూడా స్వీక‌రించి, పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్తోందని గుర్తు చేశారు. దేశ చ‌రిత్ర‌లో ఇంత పెద్ద మొత్తంలో రుణ‌మాఫీ చేసింది కేవ‌లం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లంతా గుర్తించి రైతాంగం మొత్తం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రైతుల‌ కు మేలు చేకూరుడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. అందుకే నిర‌స‌న‌ల పేరిట‌, రాజ‌కీయ నాట‌కాల‌కు తేర తీస్తోంది. రైతులు కూడా ఈ పరిమానాలను ఈ స‌డించుకుంటున్న బీఆర్ఎస్ నేత‌ల‌కు బుద్ధి రావ‌డం లేదని, రాజ‌కీయ ప్రేరేపిత ఆందోళ‌న‌లు, ప్ర‌జా క్షేత్రంలో నిలువవన్న నిజం బీఆర్ఎస్ తెలుసుకోవాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చేందుకు సిద్ధంగా ఉంది, ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లంతా అండ‌దండ‌గా ఉంటున్నారు అని అన్నారు.

Advertisement

Next Story