- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేయూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు
దిశ,వరంగల్ కలెక్టరేట్ : కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో ఆదివారం సెక్యులర్ రైటర్స్ ఫోరం సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ అధికారుల అనుమతి లేదని దాదాపు 300 మంది హాజరయిన సమావేశానికి రిజిస్ట్రార్ ప్రో. మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారని, ఈ సమావేశం నిర్వహణకు వైస్ ఛాన్సలర్ ప్రో.తాటికొండ రమేష్ మౌఖికంగా అనుమతి ఇవ్వడం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినట్లేనని వారిరువురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎలక్షన్ అధికారులకు హన్మకొండకు చెందిన డా. ప్రసాద్ ఫిర్యాదు చేశారు. గతంలో ప్రభుత్వాలు నిషేధించిన సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం అకడమిక్ సమావేశం కాదని ఇది పూర్తిగా రాజకీయ సమావేశమేనని, ఈ సమావేశంలో "డీకోడింగ్ రామాయణ, సాహిత్య రాముడు - రాజకీయ రాముడు" అనే అంశాలపై హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ రాముడిని రాజకీయ దృష్టితో చూస్తూ అసభ్యంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూనివర్సిటీలో అకాడమిక్ సమావేశాలు జరగాల్సింది పోయి రాజకీయ సమావేశాలు నిర్వహణకు అనుమతిచ్చిన వీసీ ప్రో.రమేష్, పై అందులో పాల్గొని ప్రసంగించిన రిజిస్ట్రార్ ప్రో.మల్లారెడ్డి పై వెంటనే జిల్లా ఎలక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
అకడమిక్ సమావేశాన్ని రాజకీయ సమావేశం గా మార్చిన నిర్వాహకులు..
కేయూలో జరిగిన ఈ సమావేశం అకడమిక్ సమావేశంగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశం ఆదివారం జరపడంలో ఉద్దేశ్యాన్ని గమనించాలని, సమావేశానికి యునివర్సిటీ లోని సాహిత్య విభాగాలైన తెలుగు, ఆంగ్లం, హ్యుమానిటీస్ విభాగాల నుండి ఎవరూ హాజరు కాలేదని, కనీసం యూనివర్సిటీ లో వున్న రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు కూడా హాజరు కాలేదని అన్నారు. ఇతర యూనివర్సిటీ ల నుండి సాహిత్య విభాగాలకు సంబంధించిన టీచర్లు హాజరు కాలేదని మరి ఇటువంటి సమావేశం ఏ విధంగా అకాడెమిక్ సమావేశం అవుతుందని అన్నారు. 300 మంది వామపక్ష భావజాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారని, ఈ సమావేశంలో రాముడి పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఇది అకడమిక్ సమావేశం ఎలా అవుతుందని ఫిర్యాదులో అన్నారు. ఎలక్షన్ అధికారుల అనుమతి లేకుండా సమావేశం నిర్వహించిన వారితో పాటు, ఈ సమావేశానికి ప్రభుత్వ సంస్థ యొక్క సెనేట్ హల్ లో జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన వీసీ ప్రో.రమేష్, పై సమావేశంలో పాల్గొన్న ప్రో.మల్లారెడ్డి పై ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ధిక్కరించినందుకు గాను జిల్లా ఎలక్షన్ అధికారులు 1951 ప్రజా చట్టం సెక్షన్ 126 కింద, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 171 సీ కింద చర్యలు తీసుకోవాలని డా. ప్రసాద్ ఫిర్యాదులో తెలిపారు.