శివరాత్రి పర్వదినాన వరంగల్ ప్రజలకు శుభవార్త

by Disha daily Web Desk |
శివరాత్రి పర్వదినాన వరంగల్ ప్రజలకు శుభవార్త
X

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి మరో 635 రెండు పడక గదులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అందించారన్నారు. ఇప్పటికే నర్సంపేట డివిజన్ కి 960 రెండు పడక గదులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఇండ్లను మంజూరు చేస్తూ జీ.ఓ. విడుదలైనట్లు తెలిపారు. మొత్తంగా నర్సంపేట నియోజక వర్గానికి 1595 రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా... మొదటి విడతగా నర్సంపేట పట్టణంలో గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, అర్హుల జాబితా మార్చి 30లోగా ప్రకటించాలని రెవెన్యూ అధికాదిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి మరోరులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఎవరి స్థలంలో వారే ఇండ్లు నిర్మించుకునే వెసులుబాటును కూడా త్వరలోనే కేసీఆర్ ప్రకటించబోతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవో నెంబర్ 58 ప్రకారం 125 గజాలలోపు ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకునేవారికి ఉచితంగా పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. కాగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో స్వంత ఇంటి స్థలం కూడా లేని అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి పట్టాలను ఇచ్చేవిధంగా సర్వే నిర్వహించి, ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే గ్రామాలవారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed