ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం.. కనుల పండువగా మల్లన్న కళ్యాణం..

by Kalyani |
ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం.. కనుల పండువగా మల్లన్న కళ్యాణం..
X

దిశ, ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో భాగంగా చివరి వారం కావడంతో ఆదివారం భక్తులు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో స్వామివారి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి మహాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్ లో భక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు గంటలపాటు మంచి నీళ్ల కోసం ఇబ్బంది పడ్డారు. భక్తులు స్వామివారికి బోనం వండి నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

సంక్రాంతి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాదితో జాతర ముగుస్తుంది. అలాగే అంగరంగ వైభవంగా ఒగ్గు పూజార్లు మల్లన్న కళ్యాణం, పెద్దపట్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ మారెన్ని రవీందర్రావు, జడ్పీటీసీ గజ్జల శ్రీరాములు, ఆలయ కార్య నిర్వాహక అధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, దేవాదాయ మాజీ చైర్మన్ బడి చర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story