- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వచ్చాక కరెంట్ సమస్య తీరింది : గండ్ర
దిశ,భూపాలపల్లి : కేసీఆర్ వచ్చాకే కరెంట్ సమస్య తీరిందని భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఫకీరు గడ్డ ఆకు దారి వాడలో ఇంటింటి ప్రచారంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే పోలింగ్ లో నాకు ఓటు వేసి మరింత శక్తిని ఇవ్వాలి అన్నారు. నాడు తెలంగాణ రాకముందు గ్రామాల్లో కరెంటు ఉంటే వార్త అని... కానీ నేడు కరెంటు పోతే వార్త అని... అన్నారు.భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా నీటి సమస్యను, అంతర్గత రోడ్లను, డ్రైనేజీలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
నేడు భూపాలపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కానీ కొంతమంది ఏమీ కూడా అభివృద్ధి జరగలేదని అంటున్నారని కండ్లు ఉండి చూడలేని వారు ఉన్నారని అన్నారు. రమణారెడ్డిని తిడితే ఓట్లు రావని ప్రతిపక్ష పార్టీలకు మీకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ప్రశ్నించాలన్నారు. రాబోయే రోజుల్లో భూపాలపల్లి పట్టణానికి మాస్టర్ ప్లాన్ తీసుకొని వస్తానని అన్నారు. భూపాలపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధి కొనసాగుతున్న సంక్షేమం కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కెసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని అన్నారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో ను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.