- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే కుట్ర: కనకారెడ్డి
దిశ, జఫర్‌గడ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయి ఉద్యమాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. గురువారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం తమ్ముడపెళ్లి(జి) గ్రామంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం గుండెబోయిన రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అన్నారు. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల, కార్మికుల హక్కులు కాలరాస్తూ, వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య, మండల కమిటీ సభ్యులు వడ్లకొండ సుధాకర్, మండల నాయకులు ఎండీ.శంశోద్ధిన్, అంబటి యాదగిరి, వేల్పుల రవి, వేల్పుల చిన్న రాములు, నక్క యాకయ్య, ఉప్పునూతల మల్లయ్య పాల్గొన్నారు.