భూమి పత్రాలు లేవు.. మిల్లు యజమానిపై చర్యలు తీసుకోండి

by Disha News Web Desk |
భూమి పత్రాలు లేవు.. మిల్లు యజమానిపై చర్యలు తీసుకోండి
X

దిశ, మహముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రంలో నిర్మించిన రైస్ మిల్‌కు ఎలాంటి భూమి పత్రాలు లేవని, వెంటనే మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు శనివారం తహసీల్దార్ మాధవికి ఫిర్యాదు చేశారు. మహముత్తారానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రైస్ మిల్ నిర్మాణానికి భూమి విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ.. రైస్ మిల్‌కు సంబంధించిన భూమి హక్కు పత్రాలు పరిశీలిస్తామని, అలాగే సర్వే జరిపించి పట్టా భూమి కాకుంటే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన వారిలో మహముత్తారం గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం లింగయ్య గౌడ్, ఎంపీటీసీ శ్రీపతి సురేష్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ జగన్ నాయక్, గ్రామస్తులు తాటి లచయ్య, మార్క రాము గౌడ్, మార్క బాపుగౌడ్, ముక్కెర రాజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed