Collector Diwakar TS : మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

by Aamani |
Collector Diwakar TS : మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
X

దిశ, కన్నాయిగూడెం : 30వ తేదీన ములుగు జిల్లాలో నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్,రహదారి,రివ్యూ సమావేశ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం తుపాకులగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని -1 తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడి చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్, డి ఈ ప్రవీణ్,శరత్,తహసీల్దార్ సలీం,ఎంపీఓ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story