- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Coal mining : కోల్ మైనింగ్‌లో వర్షపు నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
దిశ,మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, మల్హర్ మండలం తాడిచర్ల లోని కోల్ మైనింగ్ లో గురువారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షాలకు నిలిచిన నీరుతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం,మట్టి తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని సింగరేణి పరిధిలో నిర్వహిస్తున్న 2,3 ఓసిపి ఒక్కొక్క గనుల్లోని రెండవ స్విఫ్ట్ లో సుమారు 3,500 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. అదేవిధంగా తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో ఏఎమ్మర్ ప్రైవేటు సంస్థ చేపడుతున్న ఓసీపీ కోల్ మైనింగ్ ప్రాజెక్టులో రోజుకు 6000 మెట్రిక్ టన్నులు వెలికి తీయాల్సిన బొగ్గు నిలిచిన వరద నీరుతో 4000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లు, మట్టి తవ్వకాలు 80 వేల క్యూబిక్ మీటర్ల వెలికితీతకు ఆటంకం ఏర్పడిందని సమాచారం. వర్షాల కారణంగా గనుల్లో రోడ్లు బురదమయం కావడంతో బొగ్గు, మట్టి వెలికి తీసే, యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.