- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bayyaram : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మరుగుదొడ్ల క్లీనింగ్.. తల్లిదండ్రులు ఆగ్రహం
దిశ,బయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో మరుగుదొడ్ల క్లీనింగ్ చేయిస్తున్నారు. గురువారం పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్ల క్లీనింగ్ ను దబ్బ రవి అనే విద్యార్థితో శుభ్రం చేస్తుండం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు ఒకే విద్యార్థితో అ పనులు చేయడం తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వారు పాఠశాల ఉపాద్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సరైన బోధన చేయకుండా ఒకే పాఠ్యాంశం వారం పది రోజులు బోదించడంపై పేరెంట్స్ ఉపాద్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో పర్యవేక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎంఈఓ పర్యవేక్షణ కొరవడి ఉపాద్యాయుల విధులు నామ మాత్రంగా కొనసాగుతున్నట్లు మండలంలో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మండల ఎంఈఓ పూల్ చంద్ వివరణ కోరగా విద్యార్థులతో మరుగుదొడ్ల శుభ్రంపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు డీఈఓ రామారావు కి పిర్యాదును తెలియజేస్తామని తెలిపారు.