- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియో.. మొత్తంలో అదే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సీన్ అంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేను రౌడీనే సినిమా టైంలో ఒకరినొకరు ఇష్ట పడ్డ ఈ జంట దాదాపు 7 ఏళ్ళు ప్రేమలో ఉండి టు ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఈ కపుల్‌కి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారికి ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలగ్ దైవాగ్ ఎన్ శివన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వెకేషన్స్‌ని వెళ్లిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటారు. ఈ క్రమంలో వీరి పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజాగా నయన్, విఘ్నేష్ పెళ్లి ఫోటోగ్రాఫర్స్.. వీరి మ్యారేజ్ వీడియోను షేర్ చేశారు. ఇక పెళ్లి వీడియోను.. ఫస్ట్ వెడ్డింగ్ గ్లింప్స్ పేరుతో విడుదల చేశారు. ఈ వీడియోలో నయన్.. ఐకానిక్ రెడ్ కలర్ బ్రైడల్ చీర కట్టుకుని.. పెళ్లి కూతురు గెటప్‌లో నడుస్తూ.. వివాహ వేదిక వద్దకు వస్తూ కనిపించారు. ఆ సమయంలో విఘ్నేష్ ఆమె కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని వేద మంత్రాల మధ్య నయన్ మెడలో కడతారు. అయితే వీడియోలో సెలబ్రిటీలను కూడా చూపించారు. షారుక్, రజనీ.. నయన్, విఘ్నేష్ పై పూల వర్షం కురిపించారు. సూర్య, జ్యోతిక ఒకరినొకరు చూసుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టు ఉన్నారు.
అలాగే ఈ వీడియోలో మెహందీ బిట్స్‌ను కూడా యాడ్ చేశారు. అందులో నయన్ నవ్వుతూ క్యూట్‌గా కనిపించారు. అదే సమయంలో విఘ్నేష్ .. నయన్ నుదిటిపై ఎమోషనల్ అండ్ రొమాంటిక్ కిస్ పెట్టారు. వీడియో మొత్తంలో కిస్ మూమెంట్ హైలెట్‌గా నిలిచింది. వెడ్డింగ్ గ్లింప్స్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.