TG Assembly: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. హరీష్‌రావుకు స్పీకర్ చురకలు!

by Ramesh N |
TG Assembly: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. హరీష్‌రావుకు స్పీకర్ చురకలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race)వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించారు. ఇవాళ శాసనసభలో భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందుగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ-కార్ రేస్‌పై సభలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) పట్టుబట్టారు. దీంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad Kumar) స్పందిస్తూ.. ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదన్నారు.

కొంత మంది మంత్రులు మండలిలో ఉన్నారని, సంబంధిత మంత్రి శాసనసభకు వచ్చాక మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తానని స్పీకర్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గవర్నమెంట్ బిల్లు అనేది ఇంపార్టెంట్ అని, భూ భారతి బిల్లుపై చర్చ అయిపోయాక స్పీకర చాంబర్‌లో మాట్లాడుదామని స్పీకర్ స్పష్టం చేశారు. సంబంధిత మినిస్టర్ లేనప్పుడు ఇలా చేయడం కుదరదు.. సీనియర్ శాసన సభ్యుడైన హరీష్ రావు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని హరీశ్‌రావుకు స్పీకర్ చురకలంటించారు.

Advertisement

Next Story