Lok Sabha : లోక్ సభ నిరవధిక వాయిదా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-20 06:17:06.0  )
Lok Sabha : లోక్ సభ నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : లోక్ సభ(Lok Sabha) నిరవధిక వాయిదా (Adjourned)పడింది. జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)ను లోక్ సభ జేపీసీ(JPC)కి పంపించింది. పార్లమెంటు శీతకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు పార్లమెంటు భవనం బయట పోటాపోటీ నిరనసను చేపట్టారు. గురువారం రోజున పార్లమెంటు మెట్ల మీద జరిగిన ఘటనలకు నిరసనగా ఇరువర్గాలు కూడా ఈ రోజు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ(Rajya Sabha) మధ్యాహ్యం 12గంటలకు వాయిదా పడింది.

నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల మొదటి వారంలో పలు మార్లు వాయిదాల పర్వం కొనసాగింది. గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది. ఈ సెషన్ లోనే కేంద్రం లోక్ సభలో 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లు ప్రవేశపెట్టి చర్చ చేపట్టింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్ సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపింది.

అంతకుముందు ఈ సమావేశాల్లో రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై చర్చలు సమావేశాలను వేడెక్కించాయి. బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్ సభలో అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి. చివరకు అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటు భవనం మెట్ల వద్ధ జరిగిన నిరసనలు ఎన్డీఏ, కాంగ్రెస్ పక్షాల మధ్య తోపులాటలకు, పరస్పర కేసులకు దారితీశాయి.

Advertisement

Next Story