- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతులు విత్తనశుద్ధి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి’
దిశ,తంగళ్లపల్లి : రైతులు విత్తన శుద్ధి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం రాళ్లపేటలో శుక్రవారం వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు రైతులకు కూనారం సన్నాలు అనే వరి రకం విత్తనాలను పంపిణీ చేశారు. వరిలో విత్తన శుద్ధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. జె. రాజేందర్, రైతులకు విత్తనశుద్ధి ప్రాముఖ్యత వివరించారు. రైతులకు స్వయంగా విత్తన శుద్ది ఎలా చేసుకోవాలో నేర్పించారు.
కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిం 50 శాతం మందును కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలని, దంప నారుమళ్ళకయితే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండెజిమ్ 50 శాతం మందును కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలని తెలిపారు. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుందని తెలిపారు. కార్బండెజిమ్ 25 శాతం, మాంకోజెబ్ 50 శాతం మిశ్రమ శిలీంధ్రనాశనిని వాడితే 2 గ్రా.లు కిలో విత్తనానికి, లీటరు నీటికి చొప్పున వాడుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు, దత్తత గ్రామ కమిటీ సభ్యులు డా. సతీష్, డా. సంపత్, రాళ్ల పేట మాజీ సర్పంచ్ పరశురాములు, రైతులు పాల్గొన్నారు.