Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ‘1984’ బ్యాగు అందజేసిన బీజేపీ ఎంపీ అపరాజితా

by Shamantha N |
Priyanka Gandhi:  ప్రియాంక గాంధీకి ‘1984’ బ్యాగు అందజేసిన బీజేపీ ఎంపీ అపరాజితా
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) స్టేట్ మెంట్ బ్యాగ్స్ ధరించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి (Aparajita Sarangi) ప్రియాంకకు ‘1984’ అని రెడ్ కలర్ తో రాసి ఉన్న బ్యాగును అందించారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకకు బ్యాగులంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు ‘1984’ నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన బ్యాగు ఇచ్చాను. ఫస్ట్ దాన్ని తీసుకోవడానికి ఆమె నిరాకరించినా.. తర్వాత తీసుకొని పక్కన పెట్టేశారు’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో నేటితరానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ బ్యాగును గిఫ్ట్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రియాంక గాంధీ వినూత్న నిరసన..

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మోడీ, అదానీలు కలిసి ఉన్న బ్యాగుని తీసుకొచ్చారు. అలానే పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగులు, బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు సందేశం ఉన్న బ్యాగులను వెంట తీసుకువచ్చి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ ప్రియాంకకు బ్యాగుని గిఫ్ట్ చేశారు.

Advertisement

Next Story