- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cars24: 'కన్నడ మాట్లాడటం రాదా? ఢిల్లీకి రండి'.. కార్స్24 సీఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: పాత కార్ల క్రయవిక్రయాలు నిర్వహించే ప్రముఖ ప్లాట్‌ఫామ్ కార్స్24 సీఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియామకాలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే క్రమంలో భాష, ప్రాంతీయ విభేదాలకు దారి తీసేలా వ్యవహరించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉద్యోగాల కోసం బెంగళూరులోని వారిని ఉద్దేశించి కార్స్24 సీఈఓ విక్రమ్ చోప్రా.. 'ఏళ్లుగా బెంగళూరులో ఉన్నప్పటికీ కన్నడ మాట్లాడలేకపోతున్నారా? అయితే ఏం పర్లేదు, ఢిల్లీకి రండి. ఢిల్లీలో అన్నీ అనుకూలంగా ఉన్నాయని మేము చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. ఢిల్లీకి రావాలనుకునే వారు తనకు మెయిల్ చేయండి. ఢిల్లీ మేరీ జాన్' అంటూ విక్రమ్ చోప్రా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. కార్స్24 సీఈఓ ధోరణి కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడ్డం సరికాదని కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ద్వారా మీ కంపెనీలో ఉత్తరాది వారు మాత్రమే పనిచేయాలని భావిస్తున్నారా? అంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో విక్రమ్ చోప్రా గతంలో పెట్టిన పోస్ట్‌లను బయటకు తీసి నెటిజన్లు చర్చిస్తున్నారు. 2009లో విక్ర&్ చోప్రా..'ఢిల్లీలో స్థానికులతో చర్చించడమే అత్యంత క్లిష్టమైన విషయమని' ట్వీట్ చేశారు.