- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాలుడికి జికా వైరస్ లేదు: తేల్చేసిన చెన్నై వైద్యులు
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో బాలుడి(Boy)కి జికా వైరస్(Zika Virus) లక్షణాలు కనిపించాయని చెన్నై(Chennai) ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడికి జికా వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధారించారు. బాలుడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. కానీ పుణే వైరాలజీ ల్యాబ్(Pune Virology Lab) నుంచి పూర్తి వివారాలు రావాలని వైద్యులు తెలిపారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందని బాలుడు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాలుడిని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడిలో ఏదో వైరస్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు అనుమానించారు. వెంటనే చెన్నై ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్త మయ్యాయి. ఈ మేరకు గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.