- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formula-E car racing)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ (Single Bench Justice Shravan) ఆ పిటిషన్‌ను విచారించనుంది. అయితే, ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ (Quash Petition) విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్ (ACB Council) తెలిపింది. దీంతో కేటీఆర్ తరఫు న్యాయవాది చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేయగా.. పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు అందాయి. దీంతో మధ్యాహ్నం 2.15 కు హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car racing) వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఏసీబీ (ACB) అధికారులు గురువారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా కేటీఆర్ (KTR), ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ (IAS Aravind Kumar), ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఏసీబీ (ACB)కి లేఖ రాశారు.