మాజీ మంత్రి మిల్లుపై సివిల్ సప్లై,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు..క్రిమినల్ కేసు నమోదు

by Aamani |   ( Updated:2024-09-20 15:06:01.0  )
మాజీ మంత్రి మిల్లుపై సివిల్ సప్లై,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు..క్రిమినల్ కేసు నమోదు
X

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ఎల్లంపేట శివారులోని మాజీ మంత్రి రెడ్యానాయక్ కి చెందిన శ్రీ లక్ష్మీ పారా బాయిల్డ్ మిల్లు పై రాష్ట్ర సివిల్ సప్లై,టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడిలో సుమారు కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2022- 23 సంవత్సరానికి రబీ సీజన్ కి సంబంధించిన ధాన్యం 62 వేల 578 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వడం జరిగిందని, దానికి బియ్యం 42 వేల 553 క్వింటాళ్ల బియ్యం ఇవ్వవలసి ఉన్నప్పటికీ 24వేల 336 క్వింటాళ్ల మిల్లింగ్ రైస్ అప్పగించారని మిగతా 18,216 క్వింటాళ్ల బియ్యం అప్పగించలేదన్నారు. 66,978 ధాన్యం బస్తాలు,క్వింటాళ్లో అయితే 26,784 క్వింటాళ్లు మిల్లులో నిల్వ ఉండాలి. కానీ సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించినప్పుడు గోదాంలో ఒక్క గింజ కూడా లేదని ధాన్యానికి సంబంధించిన బస్తాల ఖరీదు రూ. 6 కోట్ల 49 లక్షల 33 వేల ఖరీదు ఉంటుందని తెలిపారు.అలాగే మిల్లు యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీస్ వారికి సూచించారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై,టాస్క్ ఫోర్స్ అధికారుల ఓఎస్డీ,ఎం ప్రభాకర్,ఎస్సై జంగయ్య ,డీసీఎస్ఓ ప్రేమ్ కుమార్, డీఎం. కృష్ణవేణి, ఏఎస్ఓ ప్రభాకర్ , టెక్నికల్ అసిస్టెంట్ శంకరయ్య , మరిపెడ ఎమ్మార్వో సైదులు ,ఎస్సై సతీష్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed